CMCH | కోయంబత్తూరు మెడికల్ కాలేజీలో దారుణం.. హౌజ్ సర్జన్ పట్ల అసభ్య ప్రవర్తన
CMCH | మహిళా డాక్టర్ల పట్ల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో దారుణం వెలుగు చూసింది. హౌజ్ సర్జన్ పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
CMCH | చెన్నై : మహిళా డాక్టర్ల పట్ల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో దారుణం వెలుగు చూసింది. హౌజ్ సర్జన్ పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో 150 మంది హౌజ్ సర్జన్లు ఆందోళనకు దిగారు. మహిళా డాక్టర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని నిన్న సాయంత్రం నుంచి హౌజ్ సర్జన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్‌గా స్పందించారు. డాక్టర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ మెడికల్ ఆఫీసర్ పేర్కొన్నారు. మహిళా డాక్టర్ల రక్షణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని డీన్ ఆఫీసు ముందు డాక్టర్లు ఆందోళనకు దిగారు.
కోయంబత్తూరు మెడికల్ కాలేజీలోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, సెంటినరీ బిల్డింగ్ మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత డాక్టర్ తన స్కూటీని తీసుకెళ్లేందుకు పార్కింగ్‌కు వెళ్లగా, అక్కడున్న వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని తోసేసి ఆమె అక్కడ్నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు డీన్ డాక్టర్ నిర్మల మీడియాకు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Kolkata murder | ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా.. రేపు 24 గంటలపాటు వైద్య సేవలు నిలిపివేత
Assembly Polls | దేశంలో మరోసారి మోగనున్న ఎన్నికల నగారా.. నాలుగు రాష్ట్రాలకు నేడు షెడ్యూల్ ప్రకటన..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation | ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. డీలిమిటేషన్‌పై బీజేపీ, కాంగ్రెస్ సొంత వ్యూహాలు?
Deeksha Divas | ఉద్యమానికి ఊపిరిలూదిన దీక్షా దివస్.. నేడు కరీంనగర్ గడ్డపై స్ఫూర్తి సభ
Regional Parties | 816కు సీట్లు పెరిగినా సంకీర్ణమే.. 2029 ఎన్నికలకల్లా జాతీయ పార్టీలు మరింత ఖల్లాస్!
KCR | కూటమి నీతితో ఓటమిని గెలిచి.. కేసీఆర్ బ్రహ్మాస్త్రం
Horoscope | 29-11-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

