లండన్-ముంబై విమానంలో అనుచిత ప్రవర్తన : వ్యక్తిపై కేసు నమోదు
లండన్ నుంచి ముంబైకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తోటి ప్రయాణీకుల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించడంతో పాటు బహిరంగంగా పొగతాగడంతో కేసు నమోదు చేశారు.
న్యూఢిల్లీ : లండన్ నుంచి ముంబైకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తోటి ప్రయాణీకుల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించడంతో పాటు బహిరంగంగా పొగతాగడంతో కేసు నమోదు చేశారు. దురుసుగా ప్రవర్తించిన రమాకాంత్ (37)పై ముంబైలోని సహర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విమానాల్లో స్మోకింగ్‌ను అనుమతించరని అయితే రమాకాంత్ వాష్‌రూంకు వెళ్లగా అలారం మోగడంతో వాష్‌రూంలో సిగరెట్ తాగుతూ ఆయన సిబ్బందికి పట్టుబడ్డారని ఎయిర్ ఇండియా సిబ్బంది తెలిపారు.
దీంతో రమాకాంత్ విమాన సిబ్బందిపై కేకలు వేస్తూ అభ్యంతరకరంగా ప్రవర్తించాడని కొద్దిసేపటి తర్వాత విమానం డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించడంతో ప్రయాణీకులు బెంబేలెత్తారని విమాన సిబ్బంది పేర్కొన్నారు. ఆపై రమాకాంత్‌ను సీటులో కూర్చోపెట్టి అతడి కాళ్లు, చేతులు కట్టేశామని విమాన సిబ్బంది సహర్ పోలీసులకు వివరించారు. ప్రయాణీకుల్లో ఓ వైద్యుడు ఉన్నారని ఆయన నిందితుడిని పరీక్షించగా తన బ్యాగ్‌లో మందులున్నాయని రమాకాంత్ చెప్పాడని తెలిపారు.
బ్యాగ్‌ను తనికీ చేయగా ఎలాంటి మందులు లేకపోగా అందులో ఈ-సిగరెట్ కనిపించిందని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసిన సహర్ పోలీసులు రమాకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. భారత సంతతికి చెందిన రమాకాంత్ యూఎస్ పాస్‌పోర్ట్ కలిగిఉన్నాడని ఆయన అమెరికా పౌరుడని పోలీసులు తెలిపారు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

