న్యూఢిల్లీ : లండన్ వీధుల్లో గాన విన్యాసంతో ఆకట్టుకున్న సింగర్ మరోసారి ఎవర్గ్రీన్ సాంగ్ క్యా హువా తేరా వదా సాంగ్‌ను బ్రిటన్‌లోని హన్స్లోలో ఆలపించాడు. ఈ వీడియోను విష్ సోషల్ మీడియాలో (viral video) షేర్ చేయగా ఇప్పుడది తెగ వైరలవుతోంది.
ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను షేర్ చేయగా నెటిజన్లు సింగర్ టాలెంట్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ పాటను విష్ హృద్యంగా ఆలపిస్తూ అక్కడ చేరినవారిని అలరించడం వీడియోలో కనిపిస్తుంది. సింగర్ చేతిలో మైక్రోఫోన్‌తో ఉండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ పెప్పీ మ్యూజిక్ అలరిస్తుంది.
హన్స్లో, యూకేలో మహ్మద్ రఫీ పాటలు పాడుతున్నానని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 3 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. మీరు అంకితభావంతో ఆత్మతో పాడుతున్నట్టు అనిపించిందని ఓ యూజర్ కామెంట్ చేయగా, గొప్ప పాటను ఎంచుకున్నారని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Bus accident in Saudi Arabia | ఘోర ప్రమాదం.. వంతెనను ఢీ కొట్టిన యాత్రికుల బస్సు.. 20 మంది మృతి