Mumbai rains | ముంబైలో భారీ వర్షాలు.. మ్యాన్‌హోల్‌లో పడి ఒకరి మృతి.. వర్షాలతో మూడో మరణం
Mumbai rains : మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తాజాగా ముంబైలో భారీ వర్షం కారణంగా ఒక వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడి కొట్టుకుపోయాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ముంబైలోని చండివలి ఏరియాలో జరిగింది.
Mumbai rains : మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తాజాగా ముంబైలో భారీ వర్షం కారణంగా ఒక వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడి కొట్టుకుపోయాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ముంబైలోని చండివలి ఏరియాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చండివలి, సన్మాన్ హోటల్ సమీపంలోని ఖైరాని రోడ్డులో మెయింటెనెన్స్ వర్క్ జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడ అస్లాం ఇసాక్ షేక్ (60) అనే వృద్ధుడు ఫోన్లో నడుచుకుంటూ వెళ్తుండగా, ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు.
దీంతో అతడు ఆ మ్యాన్‌హోల్‌లో పడి కొట్టుకుపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. దర్యాప్తు జరుపుతున్నారు. అతడి మృతదేహాన్ని వెలికితీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. మ్యాన్హోల్లోకి నిచ్చెన వేసి అతడి కోసం గాలించారు. కానీ, అతడి గొడుగు, చెప్పులు మాత్రమే కనిపించాయి. మ్యాన్‌హోల్‌లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల అతడు ఎటువైపు కొట్టుకుపోయాడో కచ్చితంగా చెప్పడం కష్టమని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు అన్నారు. అతడిని గుర్తించడం కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ అంశంలో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవల వర్షాల కారణంగా ముంబైలో సంభవించిన మూడో మరణం ఇది.
మంగళవారం ముంబై, చెంబూర్‌లోని ఒక స్కూల్ బస్సుపై చెట్టు పడటంతో 11 ఏళ్ల బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరికొందరు విద్యార్థులు గాయపడ్డారు. ఒక బిల్డింగ్ మూడో ఫ్లోర్ బాల్కనీ కూలిన ఘటనలో 51 ఏళ్ల మరో వ్యక్తి మరణించాడు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కొద్ది రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొన్ని చోట్ల 200 మి.మీ.వర్షపాతం నమోదైంది. అనేక చోట్ల నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. ముంబైలో శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BMC
- Heavy Rains
- Manhole
- Mumbai
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

