న్యూఢిల్లీ, మే 8: ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు కామీ రీటా. 56 ఏండ్ల వయసులో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. 26వ సారి ఆ పర్వతాన్ని ఎక్కి ప్రపంచంలోనే ఎక్కువసార్లు అధిరోహించిన వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు.
ఇప్పటివరకు ఈ రికార్డు ఆయనపేరు మీదే ఉండగా, తాజాగా ఆ రికార్డును తిరగరాశారు. షెర్పా అయిన కామీ రీటా.. ట్రెక్కింగ్ చేసే వారికోసం ముందుగా పర్వతాన్ని ఎక్కి తాళ్లు కడుతూ ఉంటారు.