Vande Bharat train | మూత్ర విసర్జనకు వందే భారత్ రైలు ఎక్కాడు.. రూ.6,000 వదిలించుకున్నాడు
Vande Bharat train | ఒక వ్యక్తి మూత్ర విసర్జన కోసం వందే భారత్ రైలు (Vande Bharat train) ఎక్కాడు. టాయిలెట్ నుంచి బయటకు రాగానే రైలు డోర్లు మూసుకుపోయాయి. ఆ వెంటనే వందే భారత్ రైలు స్టేషన్ నుంచి కదిలింది. ఈ నేపథ్యంలో సుమారు రూ.6,000 వదిలించుకున్నాడు.
భోపాల్: ఒక వ్యక్తి మూత్ర విసర్జన కోసం వందే భారత్ రైలు (Vande Bharat train) ఎక్కాడు. టాయిలెట్ నుంచి బయటకు రాగానే రైలు డోర్లు మూసుకుపోయాయి. ఆ వెంటనే వందే భారత్ రైలు స్టేషన్ నుంచి కదిలింది. ఈ నేపథ్యంలో సుమారు రూ.6,000 వదిలించుకున్నాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి ఫ్రూట్స్ వ్యాపారి. అతడికి హైదరాబాద్‌తో పాటు సొంత ఊరైన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో ఫ్రూట్స్ షాపులున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 15న భార్య, ఎనిమిదేళ్ల కుమారుడితో కలిసి హైదరాబాద్ నుంచి భోపాల్‌కు రైలులో ప్రయాణించి సాయంత్రం 5.20 గంటలకు చేరుకున్నాడు. రాత్రి 8.55 గంటలకు సొంతూరుకు వెళ్లే రైలు ఎక్కాల్సి ఉంది. దీంతో స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్‌పై వారు వేచి ఉన్నారు.
కాగా, అబ్దుల్ ఖాదిర్ అర్జెంట్‌గా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆ ఫ్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న ఇండోర్ వెళ్లే వందే భారత్ రైలులోని టాయిలెట్లోకి వెళ్లాడు. మూత్ర విసర్జన తర్వాత టాయిలెట్ నుంచి బయటకు రాగానే రైలు డోర్లు మూసుకుపోయాయి. ఆ వెంటనే వందే భారత్ రైలు భోపాల్ స్టేషన్ నుంచి కదిలింది. దీంతో ఆందోళన చెందిన అబ్దుల్, ముగ్గురు టీసీలు, నలుగురు పోలీస్ సిబ్బందిని సంప్రదించి వారి సహాయం కోరాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కినందుకు రూ.1,020 జరిమానా చెల్లించాడు. తర్వాత స్టేషన్ ఉజ్జయినిలో ఆ రైలు దిగాడు. రూ.750 చెల్లించి అక్కడి నుంచి బస్సులో భోపాల్ చేరుకున్నాడు.
మరోవైపు భోపాల్ రైల్వే స్టేషన్లో వేచి ఉన్న అబ్దుల్ ఖాదిర్ భార్య, కుమారుడు ఈ విషయం తెలుసుకుని ఆందోళన చెందారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆమె మనస్తాపం చెందించింది. దీంతో సొంతూరు సింగ్రౌలీ వెళ్లే రైలు ఎక్కకూడదని వారు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రయాణం కోసం బుక్ చేసిన రూ.4,000 విలువైన రిజర్వేషన్లు టిక్కెట్లు వినియోగించకపోవడంతో వృథా అయ్యాయి. మూత్ర విసర్జన కోసం వందే భారత్ రైలు ఎక్కిన అబ్దుల్ ఖాదిర్ ఈ విధంగా సుమారు రూ.6,000 మూల్యం చెల్లించుకున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

