Man bites friend’s neck | రక్తం తాగుతానంటూ స్నేహితుడి మెడ కొరికిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Man bites friend's neck | రక్తం తాగుతానంటూ ఒక వ్యక్తి స్నేహితుడి మెడ కొరికాడు. (Man bites friend's neck) దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే నా రక్తం తాగుతావా అంటూ ఆగ్రహించిన స్నేహితుడు ఆ తర్వాత ఆ వ్యక్తిని హత్య చేశాడు.
ముంబై: రక్తం తాగుతానంటూ ఒక వ్యక్తి స్నేహితుడి మెడ కొరికాడు. (Man bites friend’s neck) దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే నా రక్తం తాగుతావా అంటూ ఆగ్రహించిన స్నేహితుడు ఆ తర్వాత ఆ వ్యక్తిని హత్య చేశాడు. మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాహుల్ లోహర్ అనే వ్యక్తి ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం తాగాడు. అయితే స్నేహితుడైన ఇష్తియాక్ ఖాన్ మద్యం మత్తులో రాహుల్ రక్తం తాగుతానని అన్నాడు. అంతేగాక అతడి మెడను కొరికాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఫైట్ జరిగింది. అనంతరం రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాగా, కొంతసేపటి తర్వాత రాహుల్ తిరిగి ఇష్తియాక్ ఖాన్‌ను కలిశాడు. ‘నా రక్తం తాగాలనుకుంటున్నావా? నిన్ను బతుకనివ్వను’ అంటూ అతడిపై దాడి చేశాడు. ఇష్తియాక్ తలను బండరాయితో మోది హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు రాహుల్‌ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

