మతం, పేరు దాచి.. మైనర్ బాలికతో సహా ఏడుగురిని పెళ్లాడిన వ్యక్తి
దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పలు షాకింగ్ విషయాలు తెలిశాయి. పోలీస్ అధికారిగా నమ్మించిన అస్లాం, పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడు. తన మతాన్ని దాచి పేరు మార్చుకుని హిందూ బాలిక, గిరిజన యువతులతో సహా ఏడుగురిని పెళ్లాడాడు.
రాంచీ: మతంతోపాటు పేరును దాచిన ఒక వ్యక్తి మైనర్ బాలికతో సహా ఏడుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. పోలీసుల కళ్లగప్పి కొన్నేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న అతడ్ని చివరకు అరెస్ట్ చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. 50 ఏళ్ల అస్లాం ఖాన్ తన పేరును సంజయ్ కసేరా మార్చుకున్నాడు. మతాన్ని కూడా దాచి పోలీస్ డ్రెస్ వేసుకుని పోలీస్ అధికారిగా నమ్మించాడు. గత ఏడాది డిసెంబర్ 8న హిందూ మతానికి చెందిన బాలికను లోబరచుకున్నాడు. బాలిక తల్లిదండ్రులను బలవంతం చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు వెళ్లగా అతడు పారిపోయాడు. దీంతో హర్లా పోలీస్ స్టేషన్లో అస్లాంపై కేసు నమోదైంది.
కాగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పలు షాకింగ్ విషయాలు తెలిశాయి. పోలీస్ అధికారిగా నమ్మించిన అస్లాం, పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడు. తన మతాన్ని దాచి పేరు మార్చుకుని హిందూ బాలిక, గిరిజన యువతులతో సహా ఏడుగురిని పెళ్లాడాడు. ఈ నేపథ్యంలో రాంచీ, ధన్‌బాద్, తోప్‌చాంచి, ఛాస్లలో అస్లాంపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని డిప్యూటీ ఎస్పీ కుల్దీప్ కుమార్ తెలిపారు. ఛాస్లో నమోదైన కేసులో 2021లో అతడు జైలుకు కూడా వెళ్లినట్లు చెప్పారు. సద్దాం పేరుతో రాంచీలో అస్లాం నివసిస్తున్నట్లు పోలీసులకు తెలియడంతో అతడ్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

