Mamata Bnerjee | పశ్చిమబెంగాల్లో ఒంటరిగానే పోటీ.. 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ
Mamata Bnerjee | పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్రి మమతాబెనర్జీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడబోయే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ మేరకు 42 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేశారు.
Mamata Bnerjee: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్రి మమతాబెనర్జీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడబోయే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ మేరకు 42 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేశారు. అందులో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్, ప్రస్తుత ఎంపీ మహువా మొయిత్రా సహా తదితర పేర్లు ఉన్నాయి.
లోక్‌సభ ఎన్నికల కోసం పశ్చిమబెంగాల్లో ఎవరితోనూ పొత్తులు లేవని మమతాబెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీఎంసీ అభ్యర్థులు పోటీలో ఉంటారని వెల్లడించారు. కాగా, మమతాబెనర్జీ ఇవాళ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కోల్‌కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో మెగా ర్యాలీ ద్వారా ప్రచార శంఖారావాన్ని పూరించారు.
జన గర్జన సభ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీకి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మందిని టీఎంసీ సమీకరించింది. కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌కు బకాయిలు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని ఈ సభా వేదికగా మమతా బెనర్జీ విమర్శించారు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో బీజేపీని ఓడిస్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

