గవర్నర్ ఫుల్ వీడియో నా దగ్గరుంది
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ విడుదల చేసిన వీడియో ఎడిటింగ్ చేసినదని.. పూర్తి నిడివిగల వీడియో తన వద్ద ఉందని వెల్లడించారు. శనివారం ఆమె సప్తగ్రామ్లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.
- లైంగిక వేధింపుల ఆరోపణలొస్తే పదవికి రాజీనామా చేయరా?
- ఆయన పక్కన కూర్చోవడం కూడా పాపమే: మమతా బెనర్జీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ విడుదల చేసిన వీడియో ఎడిటింగ్ చేసినదని.. పూర్తి నిడివిగల వీడియో తన వద్ద ఉందని వెల్లడించారు. శనివారం ఆమె సప్తగ్రామ్లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆనంద బోస్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు.
“మిస్టర్ గవర్నర్, మీ దాదాగిరి ఇక చెల్లదు. మీరు ముందు గద్దె దిగండి. మహిళలను హింసించడానికి మీరెవరు?” అని మమత ప్రశ్నించారు. గవర్నర్ మీడియాను పిలిచి, కొన్ని ఎడిట్ చేసిన వీడియోలను చూపించారని తాను విన్నానన్నారు. అయితే తన వద్ద ఎడిట్ చేయని పూర్తి వీడియో ఉందని, దానిని ఓ విలేకరి ఇచ్చారని చెప్పారు. “ఆయన నన్ను రాజ్ భవన్‌కు పిలిస్తే నేను వెళ్లను. వీధుల్లో కలవాలనుకుంటే కలుస్తాను. ఇలాంటి సంఘటనల గురించి విన్నాక ఆయన పక్కన కూర్చోవడం కూడా పాపమే” అని మమత అన్నారు.కాగా గవర్నర్ బోస్ ఈ నెల 9న కొన్ని సీసీటీవీ ఫుటేజ్‌లను మీడియా సమక్షంలో ప్రదర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

