Mamata Banerjee | వారు ఓట్ల కోసం ప్రజల ముందు వాలే వలస పక్షులు : కాషాయ నేతలపై దీదీ ఫైర్
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌లో శుక్రవారం జరిగిన ర్యాలీలో బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వచ్చిన వెంటనే కొందరు నేతలు ఓట్ల కోసం ప్రజల ముందు వాలిపోతారని, ఎన్నికల తర్వాత ఏ ఒక్కరూ కనిపించరని, ఎలాంటి పనులూ చేయరని దీదీ అన్నారు.
తాము ఎలాంటి ఆరోపణలు, అవినీతి మరకలు లేని అభ్యర్ధిని బరిలో నిలిపితే కాషాయ పార్టీ అభ్యర్ధి రాక్షసుడని, ఆయనపై ఎన్నో కేసులున్నాయని ఆరోపించారు. బీజేపీ అభ్యర్ధి బాగోతాలపై తన వద్ద అన్ని రికార్డులు ఉన్నాయని, వాటిని బయటపెట్టగలనని మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్ అభివృద్ధికి కట్టుబడిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బెంగాల్లో భద్రత లేదని కాషాయ నేతలు ప్రచారం చేస్తున్నారని, మరి రాజస్ధాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ సురక్షితమా అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. అసలు వాళ్లేం అభివృద్ధి చేశారని తాను వారిని నిలదీస్తున్నానన్నారు. జల్పాయిగురిలో ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించిందని, వారికి కేంద్ర ప్రభుత్వం ఏం సాయం చేసిందని దీదీ ప్రశ్నించారు.
Read More :
Lok Sabha Elections | మూడో విడుత నామినేషన్లు షురూ.. 94 ఎంపీ స్థానాల్లో మే 7న పోలింగ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

