Mallikarjun Kharge | అది సంకల్ప పత్రం కాదు అసత్యాల పత్రం : బీజేపీ మేనిఫెస్టోపై భగ్గుమన్న విపక్షం
Mallikarjun Kharge : బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై విపక్షం భగ్గుమంది. రైతులు, యువత, మహిళల సమస్యలను కాషాయ పార్టీ మేనిఫెస్టో విస్మరించిందని విరుచుకుపడింది.
Mallikarjun Kharge : బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై విపక్షం భగ్గుమంది. రైతులు, యువత, మహిళల సమస్యలను కాషాయ పార్టీ మేనిఫెస్టో విస్మరించిందని విరుచుకుపడింది. సమాజంలో ఏ వర్గానికీ ప్రధాని నరేంద్ర మోదీ మేలు చేయలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. బీజేపీ మేనిఫెస్టోను ఏ ఒక్కరూ విశ్వసించరని అన్నారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మోదీ రైతులకు కనీస మద్దతు ధరను కల్పిస్తామని మాట తప్పారని ఖర్గే ఆరోపించారు. మోదీ తన హయాంలో ఏ వర్గానికీ మేలు చేయలేదన్నారు. బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పత్రం కాదని, క్షమాపణ పత్రంలా ఉందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ దేశ దళితులు, రైతులు, యువత, గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ మేనిఫెస్టో అసత్యాల పత్రమని దీన్ని ఎవరూ నమ్మరని ఖేరా పేర్కొన్నారు. ఇక బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు కనీస మద్ధతు ధర ఊసే లేదని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటె వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ మేనిఫెస్టో బూటకపు హామీలు గుప్పించిందని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిషి ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ధరల మంట, నిరుద్యోగంపై బీజేపీ పెద్దగా దృష్టి సారించలేదని ఆమె పేర్కొన్నారు.
Read More :
IIT | వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఐఐటీల్లో కొత్త కోర్సులు.. పెరగనున్న సీట్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

