Navneet Rana | చంపేస్తామని ఎంపీ నవనీత్ రాణాకు బెదిరింపులు..!
Navneet Rana | అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తారంటూ బెదిరించారు. వాట్సాప్‌లో ఆడియోను పంపినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఆమె పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Navneet Rana | అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తారంటూ బెదిరించారు. వాట్సాప్‌లో ఆడియోను పంపినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఆమె పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంపేస్తామని తనకు బెదిరింపులు వాట్సాప్‌కు మెస్సేజ్ వచ్చిందని.. ఇందులో అసభ్య పదజాలం ఉపయోగించారు. ఈ మేరకు ఆమె వ్యక్తిగత సహాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడియో క్లిప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై సైతం అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించారు. ఎంపీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. నవనీత్ రాణా తెలుగువారి సుపరిచితమే. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. 2004లో వచ్చిన శత్రువుతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. చివరిసారిగా ఫ్లాష్‌న్యూస్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మహారాష్ట్రకు చెందిన రవిరాణాను పెళ్లి చేసుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నవనీత్ రాణా, ఆమె ఎమ్మెల్యే భర్త రవి రాణా ఏప్రిల్ 2022లో ముంబయిలోని అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వ్యక్తిగత నివాసం వెలుపల హనుమాన్ చాలీసాను పఠిస్తామని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముంబయి పోలీసులు ఇద్దరిపై దేశద్రోహం కోసం నమోదు చేసి అరెస్టు చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి (ఎస్సీ) స్థానం నుంచి మళ్లీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

