పెండింగ్ బిల్లుల కోసం ఫోన్‌కాల్స్ మోత!
పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల రూపాయల బిల్లుల కోసం మహారాష్ట్ర కాంట్రాక్టర్లు నిరసన బాట చేపట్టారు. తమకు చెల్లించాల్సిన 86 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు శుక్రవారం నుంచి ‘ఫోన్ నిరసన’ చేపట్టారు.
- మహారాష్ట్ర బీజేపీ సర్కార్‌కు నిరసన తెలుపనున్న కాంట్రాక్టర్లు
- సీఎం, డిప్యూటీ సీఎంల ఆఫీస్‌లకు మూడ్రోజులు ఫోన్ కాల్స్
ముంబై : పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల రూపాయల బిల్లుల కోసం మహారాష్ట్ర కాంట్రాక్టర్లు నిరసన బాట చేపట్టారు. తమకు చెల్లించాల్సిన 86 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు శుక్రవారం నుంచి ‘ఫోన్ నిరసన’ చేపట్టారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్రా పవార్‌లతో పాటు వారి కార్యాలయాలను శుక్రవారం నుంచి ఫోన్‌కాల్స్‌తో హోరెత్తించాలని మహారాష్ట్ర స్టేట్ కాంట్రాక్లర్ల అసోసియేషన్ (ఎంఎస్‌సీఏ) తమ సభ్యులకు పిలుపునిచ్చింది.
శుక్రవారం ఫడ్నవీస్ కార్యాలయానికి, సోమవారం షిండేకు, మంగళవారం పవార్లకు ఫోన్లు చేయాలని కోరుతూ వారిరువురి కార్యాలయాల ల్యాండ్ ఫోన్ నెంబర్లను విడుదల చేసింది. మూడు లక్షల మంది కాంట్రాక్టర్లు ముఖ్యమైన మంత్రులకు ఫోన్లు చేసి తమ పెండింగ్ బిల్లులు చెల్లిస్తారా? లేదా? అని నిలదీయాలని కోరింది. చేసిన పనులకు ఏడాదిన్నర నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని, దీని కారణంగా 10 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎంఎస్‌సీఏ ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

