ఆటో బోల్తాపడి దంపతులు దుర్మరణం
Couple died in accident: మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో ఆటో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ దుర్మరణం పాలయ్యారు.

ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో ఆటో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ దుర్మరణం పాలయ్యారు. రాయ్‌గడ్ జిల్లాలోని రోహా-కోలాడ్ రహదారిపై మంగళవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. అనంత కదమ్ (49), మనీషా కదమ్ (47) తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆటోలో ఇంటి నుంచి బయలుదేరారు. ఆ తర్వాత కాసేపటికే వారు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అనంత కదమ్ దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా వారి ఇద్దరు పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
అయితే, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆటో డ్రైవర్ గణేశ్ ఖడే నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. అతనిపై కేస్ బుక్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన తెల్లారే కొత్త పెళ్లికూతురికి ప్రసవం.. షాక్‌లో పెళ్లికొడుకు
S.S Karthikeya | కార్తికేయకు సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్.. ఫొటో వైరల్!
Vijay Antony | ‘నాన్నకుట్టి’ సినిమా ప్రమోషన్స్ కోసం జనరల్ బోగీలో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ.. నెట్టింట వైరల్!
ENE Repeat | రెండు రోజుల్లోనే రూ.23 కోట్లకు పైగా వసూళ్లు.. నార్త్ అమెరికాలోనూ మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ‘ENE రిపీట్’!
Dal Lake ride | పర్యాటకుల సందడి.. దాల్ సరస్సులో శిఖారా రైడ్ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

