సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి : కేంద్రానికి మద్రాస్ హైకోర్టు కీలక సూచన

చెన్నై : పంజరంలోని చిలకలా మారిన సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తితో స్వేచ్ఛను ప్రసాదించాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల కమిషన్, కాగ్ తరహాలో సీబీఐకి విస్తృత అధికారాలు కల్పించేలా చట్టం తీసుకురావాలని స్పష్టం చేసింది. సీబీఐకి వనరులు, సిబ్బంది పరిమితంగా ఉండటంతో విచారణ చేపట్టాల్సిన అవసరం తలెత్తినప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ తటపటాయిస్తోందని పేర్కొంది.
పరిమిత వనరులతో అది దర్యాప్తును చేపట్టలేకపోతోదని, న్యాయస్ధానాల ఎదుట సీబీఐ తన లోటుపాట్లను ఏకరువు పెట్టడం సర్వసాధారణమైందని జస్టిస ఎన్ కిరుబకరన్, జస్టిస్ పుగలేందితో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. సీబీఐకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు చేపట్టాలని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. డిప్యుటేషన్‌పై ఆధారపడకుండా సీబీఐ కోసం ప్రత్యేకంగా పనిచేసే అధికారులు ఉండాలని స్పష్టంచేశారు. నిధులు, సౌకర్యాల లేమి వంటి పలు అవరోధాలను అధిగమిస్తూ సీబీఐ పనిచేస్తోందని కోర్టు పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

