గ్యాస్ బండ మరింత భారం.. మళ్లీ పెరిగిన సిలిండర్ ధర
LPG cylinder | పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ బండపై రూ.3.50, వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్‌పై రూ.8
న్యూఢిల్లీ: పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ బండపై రూ.3.50, వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్‌పై రూ.8 వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.వెయ్యి దాటింది.
తాజా పెంపుతో ఢిల్లీ, ముంబైలో గృహావసరాలకు ఉపయోగించే 14 కిలోల సిలిండర్ ధర రూ.1003కు చేరింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ.1029, చెన్నైలో రూ.1018.5, హైదరాబాద్‌లో 1055కు పెరిగింది. ఈ నెల 7న సిలిండర్‌పై రూ.50 పెంచిన విషయం తెలిసిందే.
ఇక 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.8 పెంచడంతో రూ.2364కు చేరింది. 19 రోజుల వ్యవధిలో వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. ఈ నెల 1న సిలిండర్‌పై రూ.102.50 భారం మోపిన విషయం విధితమే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

