Health Tips : శరీర నిర్మాణం, అభివృద్ధికి ఐరన్ అత్యవసరం. శరీరానికి ఆక్సిజన్‌ను సరఫరా చేసే హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి శక్తిని సమకూర్చడం, కేశ సంరక్షణలో ఐరన్ కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే ఆధునిక జీవితంలో సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం కొరవడటంతో పలు అనారోగ్యాలతో పాటు ఐరన్ లోపం, రక్తహీనత పలువురిని వెంటాడుతున్నాయి.
ఐరన్ లోపంతో శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయని, వాటిని గమనించి సత్వరమే చికిత్స తీసుకోవాలని న్యూట్రిషనిస్ట్ మామి అగర్వాల్ చెబుతున్నారు. ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు పాలకూర, పప్పుధాన్యాలు, గుమ్మడి గింజలు, మాంసం, క్వినోవా, బ్రకోలి, డార్క్ చాక్లెట్, నట్స్, సీడ్స్, గుడ్లు, పాలు వంటి ఆహారం తీసుకోవాలి.
ఇక ఇన్స్టాగ్రాం వీడియోలో ఐరన్ లోపంతో తలెత్తే లక్షణాలను మామి అగర్వాల్ వివరించారు. ఐరన్ లెవెల్స్ తగ్గితే లేచినప్పుడు, నిలుచుని ఉన్నప్పుడు తల తిరిగినట్టు అనిపిస్తుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ సరఫరా కాకపోవడంతో నిల్చోగానే తల తిరిగినట్టు అనిపిస్తుంది. ఇంకా ఐరన్ లోపంతో కనిపించే లక్షణాలను పరిశీలిస్తే..
తల తిరగడం
గుండెలో మంట, గుండె దడ
జుట్టు ఊడిపోవడం
ఏకాగ్రత లోపించడం
శ్వాసలో ఇబ్బందులు
తీవ్ర అలసట
తలనొప్పి
Read More :