Jackpot | దుబాయ్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆదిల్ ఖాన్‌కు లాటరీ జాక్‌పాట్ తగిలింది. వేలల్లో, లక్షల్లో కాదు.. ఏకంగా కోట్లల్లోనే. 25 ఏండ్ల పాటు నెలకు రూ.5,59,822 చొప్పున ఆ అదృష్టవంతుడు అందుకోనున్నాడు.
ఆదిల్ దుబాయ్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో డిజైన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. యూఏఈలో ‘ఫాస్ట్ 5’ పేరిట నిర్వహించిన ఓ మెగా లాటరీలో మొదటి విజేతగా నిలిచాడు. దీని ద్వారా అతను 25 ఏండ్ల పాటు నెలకు రూ.5,59,822(25 వేల దిర్హామ్‌లు) అందుకోనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.