No Confidence Motion: అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా
No-Confidence Motion: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. అయితే తీర్మానంపై చర్చకు చెందిన తేదీని, సమయాన్ని త్వరలో ప్రకటించనున్నట్లు స్పీకర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇచ్చింది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11వ తేదీన ముగియనున్న విషయం తెలిసిందే. ఇక ఇవాళ లోక్‌సభలో విపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు కేవలం 13 రోజులు(వర్కింగ్ డేస్) మాత్రమే ఉన్నాయి. అయితే పద్ధతి ప్రకారం అవిశ్వాస తీర్మానంపై చర్చను షెడ్యూల్ చేసేందుకు లోక్‌సభ స్పీకర్ 10 రోజలు సమయాన్ని తీసుకునే వీలుంది. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. సుమారు 50 మంది ఎంపీలు ఆ నోటీసులపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.
#WATCH | Lok Sabha Speaker Om Birla allows the No Confidence Motion against Government moved by the Opposition.
Speaker says, "I will discuss with the leaders of all parties and inform of you of an appropriate time to take this up for discussion." pic.twitter.com/vsUmR42Kmz
— ANI (@ANI) July 26, 2023
ఇవాళ లోక్‌సభ, రాజ్యసభల్లోనూ మణిపూర్ అంశంపై రభస కొనసాగింది. రెండు సభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సమావేశమైన లోక్‌సభలో.. స్పీకర్ ఓం బిర్లా .. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు. అవిశ్వాస తీర్మానాన్ని గగోయ్ సభలో ప్రవేశపెట్టారు. దానికి స్పీకర్ స్పందిస్తూ త్వరలో చర్చ తేదీ, సమయాన్ని వెల్లడించనున్నట్లు చెప్పారు.
మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమే అని కేంద్రం అంటోంది, కానీ చర్చను తీసుకురావడం లేదని కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ తెలిపారు. ప్రధాని మోదీ సభకు రావడం లేదని, ఆయన తన చాంబర్లో కూర్చుంటున్నారని, కేవలం మీడియాతో మాత్రమే మాట్లాడుతున్నారని ఎంపీ సురేశ్ ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు తమ వద్ద కావాల్సిన సంఖ్యా బలం ఉందన్నారు.
బీఎస్పీ ఎంపీ మాలూక్ నగర్ లోక్‌సభలో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం పై చర్చిస్తామన్నారు. మణిపూర్‌పై పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందన్నారు. సీఎంను మార్చాలని డిమాండ్ చేశామన్నారు. రాజస్థాన్‌లో దళితులపై జరుగుతున్న దాడులు, రేప్‌ల గురించి కూడా డిస్కర్ చేయాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

