Watch: కోళ్లు రవాణా చేస్తున్న వాహనం బోల్తా.. స్థానికులు ఏం చేశారంటే?
Locals Loot Chickens | కోళ్లు రవాణా చేస్తున్న వాహనం బోల్తా పడింది. అందులోని కోళ్లు రోడ్డు పక్కన పడ్డాయి. గమనించిన స్థానికులు చేతికి అందిన కోళ్లను ఎత్తుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: కోళ్లు రవాణా చేస్తున్న వాహనం బోల్తా పడింది. అందులోని కోళ్లు రోడ్డు పక్కన పడ్డాయి. గమనించిన స్థానికులు చేతికి అందిన కోళ్లను ఎత్తుకెళ్లారు. (Locals Loot Chickens) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అమేథి నుంచి ఫిరోజాబాద్‌కు కోళ్లను రవాణా చేస్తున్న వాహనం డ్రైవర్, నిద్ర మత్తులో అదుపుకోల్పోయాడు. దీంతో కన్నౌజ్ ఎక్స్‌ప్రెస్‌వేపై అది బోల్తాపడింది. ఆ వాహనంలోని కోళ్లు రోడ్డు పక్కన పడ్డాయి.
కాగా, గమనించిన స్థానికులు ఆ కోళ్ల కోసం ఎగబడ్డారు. చేతికి అందిన వాటిని ఎత్తుకెళ్లారు. అయితే ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కోళ్లను లూఠీ చేస్తున్న వారిని చెదరగొట్టారు. గాయపడిన వాహన డ్రైవర్, సిబ్బందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు కొందరు వ్యక్తులు మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Kannauj, UP: A pickup truck carrying chickens from Amethi to Firozabad overturned on the Kannauj expressway after the driver fell asleep. Videos of people looting chickens went viral. Police and UPEIDA personnel intervened, dispersing the crowd, while the injured were… pic.twitter.com/FF6lRshsvp
— IANS (@ians_india) February 15, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

