న్యూఢిల్లీ : పంజాబీ సాంగ్ ఎవర్గ్రీన్కు ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో స్కూల్ బాలిక అదరగొట్టిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ప్రతీక్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వైరల్ క్లిప్‌ను 1.3 కోట్ల మంది వీక్షించారు.
ఈ వీడియోలో చిన్నారి సహ విద్యార్ధినీ, విద్యార్ధులతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండటం కనిపిస్తుంది. ఈ వీడియోలో పాప ఎక్స్ప్రెషన్స్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. డ్యాన్స్ వీడియోలో పాప పెర్ఫామెన్స్ నెక్ట్స్ లెవెల్ అని యూజర్లు కామెంట్స్ సెక్షన్లో ప్రశంసలు గుప్పించారు. క్యూట్, అడోరబుల్ అంటూ చిన్నారి మెస్మరైజింగ్ డ్యాన్స్‌ను యూజర్లు కొనియాడారు.
Read More