die of suffocation | ఇంట్లో చలి మంటలు.. ఊపిరాడక ఆరుగురు మృతి
die of suffocation | చలిని తట్టుకునేందుకు రాత్రి పడుకునే ముందు ఇంట్లో చలి మంటలు వేసుకున్నారు. అయితే ఆ పొగ వల్ల ఊపిరాడక ఆరుగురు మరణించారు. (die of suffocation) దేశ రాజధాని ఢిల్లీలోని రెండు ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగింది.
న్యూఢిల్లీ: చలిని తట్టుకునేందుకు రాత్రి పడుకునే ముందు ఇంట్లో చలి మంటలు వేసుకున్నారు. అయితే ఆ పొగ వల్ల ఊపిరాడక ఆరుగురు మరణించారు. (die of suffocation) దేశ రాజధాని ఢిల్లీలోని రెండు ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగింది. ఉత్తర ఢిల్లీలోని ఒక ఇంట్లో భార్యాభర్తలు, 7, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి డోర్ లోపల నుంచి లాక్ వేసి ఉండటంతో పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. చలిని తట్టుకునేందుకు శనివారం రాత్రి వేళ చలి మంటలు వేసుకోవడంతో పొగ వల్ల ఊపిరాడక ఆ నలుగురు మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, పశ్చిమ ఢిల్లీలోని ఇంద్రపురి ప్రాంతంలో కూడా ఇదే తరహాలో మరో సంఘటన జరిగింది. నేపాల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించారు. వారిని ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించారు. చలిని తట్టుకునేందుకు ఇంట్లో మంటలు రాజేయడంతో పొగ వల్ల ఊపిరాడక వారు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతులు నేపాల్‌కు చెందిన 57 ఏళ్ల రామ్ బహదూర్, 22 ఏళ్ల అభిషేక్‌గా గుర్తించారు. ఈ సంఘటనపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

