ముంబై, మార్చి 19: బూటకపు ఎన్కౌంటర్ కేసులో బాంబే హైకోర్టు సం చలన తీర్పునిచ్చింది. ఈ కేసులో మా జీ పోలీస్ అధికారికి జీవిత ఖైదు వి ధించింది. 2006లో చోటా రాజన్ ముఠా సభ్యుడైన రామ్నారాయణ్ గు ప్తాను ఎన్కౌంటర్ చేశారు. అది బూ టకమని తేలడంతో కోర్టు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన మాజీ పోలీస్ అధికారి ప్రదీప్ శర్మకు జీవితఖైదు విధి స్తూ మంగళవారం తీర్పు చెప్పింది.
ప్రదీప్శర్మను నిర్దోషిగా ప్రకటిస్తూ దిగువ న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వును తోసిపుచ్చింది. శర్మకు వ్య తిరేకంగా ఉన్న సాక్ష్యాలను ట్రయల్ కోర్టు పట్టించుకోలేదని, అతను దోషి అని సాక్ష్యాధారాలు నిస్సందేహంగా రుజువు చేస్తున్నాయని కోర్టు పేర్కొన్నది.