వీడియో: స్కూల్ క్యాంటీన్లోకి ప్రవేశించిన చిరుత

ముంబై: ఒక చిరుతపులి స్కూల్ క్యాంటీన్లోకి ప్రవేశించింది. దానిని పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది సుమారు నాలుగు గంటలపాటు శ్రమించారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తకాలి ధోకేశ్వర్ గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయ క్యాంటీన్లోకి ఇటీవల ఒక చిరుతపులి ప్రవేశించింది. గమనించిన స్కూల్ సిబ్బంది క్యాంటీన్ డోర్ మూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ స్కూల్‌కు వచ్చిన అటవీ శాఖ సిబ్బంది చిరుతను బంధించేందుకు నాలుగు గంటలపాటు శ్రమపడ్డారు. అది తప్పించుకోకుండా అన్ని మార్గాలను మూసివేశారు.
క్యాంటీన్ లోపల ఉన్న చిరుత అటూ ఇటూ తిరుగడంతో దానిని ఎలా పట్టుకోవాలో అటవీ శాఖ సిబ్బందికి అర్థం కాలేదు. చివరకు వంటగది డోర్‌కు చిన్న రంధ్రం చేశారు. అక్కడి నుంచి గురిపెట్టి తుపాకీతో మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. స్వల్ప గాయాలైన చిరుతను ఎట్టకేలకు అటవీ శాఖ సిబ్బంది బంధించారు. జున్నార్‌లోని మణిక్డో చిరుత పులుల రెస్క్యూ సెంటర్‌కు తరలించి చికిత్స అందించారు. కాగా, ఈ చిరుతను బంధించిన వీడియోను వైల్ట్‌లైఫ్ శాఖ విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

