లేహ్‌కు పత్య్రేక హోదా కోసం.. గడ్డకట్టే మంచులో లడఖ్ పర్యావరణవేత్త నిరాహారదీక్ష
56 ఏళ్ల వాంగ్‌చుక్ గురువారం నుంచి లేహ్‌లోని ఫియాంగ్ వద్ద గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. గడ్డకట్టే మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద నిరాహార దీక్ష చేస్తున్న తనను లడఖ్ పరిపాలన యంత్రాంగం అధికారులు తనను అదుపులోకి..
లడఖ్: కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌ను అభివృద్ధి పేరుతో నాశనం చేయవద్దని ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కోరుతున్నారు. దీనిని అడ్డుకునేందుకు లేహ్‌ను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో చేర్చాలని, ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 56 ఏళ్ల వాంగ్‌చుక్ ఈ డిమాండ్లతో గురువారం నుంచి లేహ్‌లోని ఫియాంగ్ వద్ద గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. గడ్డకట్టే మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద నిరాహార దీక్ష చేస్తున్న తనను లడఖ్ పరిపాలన యంత్రాంగం అధికారులు అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. తనను గృహనిర్బంధం చేశారని విమర్శించారు. లేహ్‌లో పర్యావరణానికి ముప్పుగా మారిన అభివృద్ధి కార్యక్రమాల గురించి నెల రోజులు మాట్లాడవద్దని, బహిరంగ సమావేశాల్లో పాల్గొన్నవద్దని ఆదేశిస్తూ ఒక బాండ్‌పై తనతో సంతకం చేయించారని ఆయన ఆరోపించారు.
మరోవైపు మెగసెసే అవార్డు గ్రహీత, ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ను తాము అదుపులోకి తీసుకోలేదని లడఖ్ పరిపాలన యంత్రాంగం తెలిపింది. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలున్న ఖర్దుంగ్ లా పాస్ వద్ద నిరాహార దీక్ష, నిరసనలు చేపట్టాలని ఆయన భావిస్తున్నారని, అయితే అందుకు అనుమతి నిరాకరించినట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

