గుజరాత్ ఎన్నికల్లో కూలీ పోటీ.. రూపాయి నాణేలతో డిపాజిట్ చెల్లింపు
ఎన్నికలకు ముందు కనిపించి హామీలు ఇచ్చే నేతలు ఆ తర్వాత వారిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తమ తరుఫున ప్రతినిధిగా ఉన్న మహేంద్ర పట్నీని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు.
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కూలీ పోటీ చేస్తున్నాడు. అంతేగాక ఎన్నికల్లో పోటీ కోసం సేకరించిన రూపాయి నాణేలతో పది వేల డిపాజిట్ మొత్తం చెల్లించాడు. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ సమీపంలో మురికివాడలో నివాసం ఉండే మహేంద్ర పట్నీతోపాటు ఇతరుల గుడిసెలను అధికారులు గతంలో రెండు సార్లు కూల్చివేశారు. 2010లో దండి కుటీర్ మ్యూజియం నిర్మాణం కోసం, 2019లో అక్కడ ఒక హోటల్ నిర్మాణం కోసం వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించారు. దీంతో నిరాశ్రయులైన 521 మంది నివాసితులు హోటల్ సమీప ప్రాంతంలో తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వ్యాపారాలు, రోజువారీ కూలీ పనులు చేసుకునే వారంతా అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు.
కాగా, ఎన్నికలకు ముందు కనిపించి హామీలు ఇచ్చే నేతలు ఆ తర్వాత వారిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తమ తరుఫున ప్రతినిధిగా ఉన్న మహేంద్ర పట్నీని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. అంతా కలిసి పది వేల వరకు రూపాయి నాణేల్లో సేకరించారు. గాంధీనగర్ నార్త్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహేంద్రకు ఆ డబ్బును ఇచ్చారు. దీంతో సెక్యూరిటీ డిపాజిట్‌గా ఎన్నికల అధికారులకు ఆయన చెల్లించాడు. శాశ్వత నివాసంతోపాటు అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కూలీ అయిన మహేంద్ర తెలిపాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

