Rahul Gandhi – Union Budget | కుర్సీ బచావో బడ్జెట్.. నిర్మలమ్మ బడ్జెట్‌పై రాహుల్ పెదవి విరుపు..!
Rahul Gandhi - Union Budget | ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2024-25)కి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్.. కుర్చీని కాపాడుకునేందుకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ మాత్రమేనని లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
Rahul Gandhi – Union Budget | ప్రస్తుత ఆర్థిక సంవత్సరా (2024-25)నికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పెదవి విరిచారు. నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత లోక్ సభ వాయిదా పడింది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ‘కేవలం అధికార పీఠాన్ని కాపాడుకునేందుకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ (కుర్సీ బచావో బడ్జెట్) అని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా పోస్ట్ చేశారు. బీజేపీ తన మిత్ర పక్షాలను బుజ్జగించేందుకు బూటకపు హమీలు గుప్పించి, ఇతర రాష్ట్రాలకు మొండి చేయి చూపిందని ఆరోపించారు. గత బడ్జెట్లు, కాంగ్రెస్ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ముఖ్యాంశాలను అరువు తెచ్చుకుని ‘కాపీ అండ్ పేస్ట్’ బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారని ఎద్దేవా చేశారు.
‘క్రోనీ క్యాపిటలిస్టులను బుజ్జగించే బడ్జెట్.. అంబానీ అదానీల పేర్లు వచ్చేలా ఏఏలకు రిలీఫ్ కల్పించే బడ్జెట్.. సామాన్యుడికి నో రిలీఫ్’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భారీ నిరుద్యోగ సమస్య జాతీయ సంక్షోభంగా మారిందని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అంగీకరించిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రాజకీయ అనివార్యతలు తప్పనిసరిగా మారిందని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

