ముంబై: టెలివిజన్ నటి సంచిత ఉగాలే(22) ఆదివారం రాత్రి మహారాష్ట్రలోని అచోలే గ్రామంలోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుంకుమ్ భాగ్య, వాగ్లె కి దునియా షోలతో ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సంచిత తన గదిలో చీరతో ఫ్యానుకు ఉరేసుకున్నారు.
కుటుంబ సభ్యులు దవాఖానకు తరలింగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఆమె ఆత్మహత్యకు కారణమేంటో ఇంకా తెలియలేదు. ఆమె మరణ వార్త అభిమానులను, టెలివిజన్ పరిశ్రమ సభ్యులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సంచిత చనిపోయే కొన్ని గంటల ముందు కూడా ఒక రీల్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.