KSRTC | ఆ మహిళలకు ఫ్రీ.. నాలుగు చిలుకలకు మాత్రం రూ.444 టికెట్..!
KSRTC | కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. బస్సులో తన వెంట తీసుకెళ్తున్న చిలుకలకు (parrots) కండక్టర్ ఏకంగా రూ.444 టికెట్ కొట్టాడు.
KSRTC | కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. బస్సులో తన వెంట తీసుకెళ్తున్న చిలుకలకు (parrots) కండక్టర్ ఏకంగా రూ.444 టికెట్ కొట్టాడు. ఇది చూసి ఆ మహిళ సహా బస్సులోని ప్రయాణికులంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఈ అంశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఓ మహిళ బుధవారం ఉదయం బెంగళూరు నుంచి మైసూర్ (Bengaluru to Mysuru)కు కేఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది. ఆ సమయంలో మనవరాలితోపాటు నాలుగు చిలుకలున్న పంజరాన్ని తన వెంట తీసుకుని వెళ్తోంది. అయితే, ప్రభుత్వ పథకాల్లో ఒకటైన ‘శక్తి’ ద్వారా మహిళకు తన మనవరాలికి కండక్టర్ ఉచిత టికెట్ ఇచ్చాడు. కానీ, నాలుగు చిలుకలకు మాత్రం టికెట్ కొట్టాడు. ఒక్కో చిలుకకు రూ.111 చొప్పున నాలుగిటికి మొత్తం రూ.444 ఇవ్వాలని సూచించాడు. ఇది చూసిన ఆ మహిళ షాక్ అయ్యింది. ఇదేంటి అని ప్రశ్నించింది. అయితే, నిబంధనల ప్రకారమే తాను టికెట్ కొట్టినట్లు సదరు కండక్టర్ వివరించారు. చిలుకలను బాలలుగా పరిగణిస్తూ ఛార్జీ వసూలు చేశాడు.
ప్రయాణికులు తమతో తీసుకెళ్లే జంతువులు, పక్షులకు సగం టికెట్ ధర చెల్లించాలని కేఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలా తీసుకోని పక్షంలో ప్రయాణికులకు వారి ప్రయాణ టికెట్ ధరలో పది శాతం జరిమానా విధిస్తామన్నారు. నిబంధనలను ఉల్లంఘించి టికెట్ ఇవ్వని కండక్టర్పై కూడా చట్టరీత్యా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Also Read..
Argentina | అర్జెంటీనా అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు..!
Dilip Ghosh | దీదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్పై కేసు నమోదు
Leopard | అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

