Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
Kolkata Stampede | పశ్చిమబెంగాల్ (West Bengal) రాజధాని కోల్కతా (Kolkata) లోని చోర్బగాన్ సర్బజనీన్ (Chorbagan Sarbojanin) దుర్గా మండపం (Durga Pandal) వద్ద గత రాత్రి జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది మృతిచెందారు. వారిలో 13 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.
Kolkata Stampede : పశ్చిమబెంగాల్ (West Bengal) రాజధాని కోల్కతా (Kolkata) లోని చోర్బగాన్ సర్బజనీన్ (Chorbagan Sarbojanin) దుర్గా మండపం (Durga Pandal) వద్ద గత రాత్రి జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది మృతిచెందారు. వారిలో 13 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మరో 35 మంది గాయపడ్డారు. గాయపడిన వారంతా ప్రస్తుతం వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉమేష్ రాయ్ స్పందించారు. చోర్బగాన్ సర్బజనీన్ దుర్గా మండపానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడం సాధారమేనని చెప్పారు. ఎప్పటిలాగే శనివారం కూడా దుర్గామాత దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని, అయితే అదే సమయంలో వర్షం కూడా పడటం తొక్కిసలాటకు దారితీసిందని చెప్పారు.
ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో మండపం బయట ఉన్న భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిచారని, అయితే లోపల కూడా అప్పటికే భక్తులు కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట జరిగిందని ఉమేష్ రాయ్ చెప్పారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిందని తెలిపారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
తొక్కిలాటలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నట్లు ఉమేష్ రాయ్ తెలిపారు. అదేవిధంగా కుటుంబంలో అర్హులైన వారు ఉంటే గ్రూప్-డి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు చెప్పారు. గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామన్నారు. అదేవిధంగా వారి వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

