Kolkata Doctors | ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి డాక్టర్ల సంఘం లేఖ
Kolkata Doctors | పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో చర్చలకు నిరాకరించిన జూనియర్ డాక్టర్లు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను వారు కోరారు. ఈ మేరకు లేఖలు పంపారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో చర్చలకు నిరాకరించిన జూనియర్ డాక్టర్లు (Kolkata Doctors) తమ నిరసన కొనసాగిస్తున్నారు. ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను వారు కోరారు. బెంగాల్ జూనియర్ డాక్టర్ల సంఘం ఈ మేరకు వారికి లేఖలు పంపింది. తమ ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరింది. ఆగస్ట్ 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడంతో పాటు హత్య జరిగింది. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.
కాగా, బెంగాల్‌లోని జూనియర్ డాక్టర్లు నాటి నుంచి విధులకు దూరంగా ఉండి నిరసన కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టు అల్టిమేటమ్తోపాటు సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినప్పటికీ స్పందించలేదు. దీంతో కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ లేఖలు రాసింది. బెంగాల్ ప్రభుత్వంతో కొనసాగుతున్న ప్రతిష్టంభనలో జోక్యం చేసుకోవాలని కోరింది.
మరోవైపు బాధిత ట్రైనీ డాక్టర్‌కు న్యాయం జరుగాలని జూనియర్ డాక్టర్లు ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో భయం లేకుండా ప్రజలకు తమ విధులను నిర్వర్తించలేక పోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ కష్ట సమయాల్లో మీ జోక్యం మాకందరికీ వెలుగునిస్తుంది. మా చుట్టూ ఉన్న చీకటి నుంచి బయటపడే మార్గాన్ని చూపుతుంది’ అని నాలుగు పేజీల లేఖలో పేర్కొన్నారు.
కాగా, డాక్టర్ల సమ్మె కారణంగా వైద్యం అందక మరణించిన 29 మంది కుటుంబాలను తమ ప్రభుత్వం
ఆదుకుంటుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మరణించిన ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
It is sad and unfortunate that we have lost 29 precious lives due to disruption in health services because of long drawn cease work by junior doctors.
In order to extend a helping hand to the bereaved families, State Government announces a token financial relief of Rs. 2 lakh…
— Mamata Banerjee (@MamataOfficial) September 13, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

