Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata stampede : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోరం జరిగింది. ఒక దుర్గా పూజా మండపంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు.
Kolkata stampede : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోరం జరిగింది. ఒక దుర్గా పూజా మండపంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర కోల్‌కతా, చోరెబగన్ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగింది. మృతుల్లో మహిళలు ఉన్నారు.
ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని సీఎం సువేందు అధికారి వెల్లడించారు. తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి, సహాయక చర్యలు చేపట్టిందన్నారు. బాధితులను వెంటనే కోల్‌కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన శనివారం రాత్రి 7.40 గంటల సమయంలో జరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఇదే సమయంలో రాత్రి భారీ వర్షం పడటం, ఒకరికి ఒకరు తోసుకోవడం, బయటకు వెళ్లే మార్గం విషయంలో గందరగోళం కారణంగా బాధితులు క్యూలైన్లలోనే చిక్కుకుపోయారు.
ఘటన జరిగిన సమయంలో ఈ ప్రదేశం మొత్తం చీకటిగా ఉంది. దీంతో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. నిర్వహణా వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లు కూడా సరిగ్గా లేవని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గందరగోళం కారణంగా భక్తులంతా ఒకేసారి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు ప్రాథమిక అంచనా. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఇదే సమయంలో నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Durga Puja
- Kolkata
- stampede
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | పాలమూరు ప్రజలారా.. రేవంత్ రెడ్డి మోసాలకు మరోసారి బలికావద్దు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Harish Rao | ఈ ద్రోహాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు.. రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఆగ్రహం
Meenakshi Chaudhary | చీరకట్టులోనూ గ్లామర్ డోస్ పెంచిన మీనాక్షి.. అదిరిపోయే ఫొటోలు!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
KTR | రోడ్డు ప్రమాద బాధితుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

