Kolkata Doctor Case | సుప్రీంకోర్టు ఆదేశించినా వెనక్కితగ్గని డాక్లర్లు..! డిమాండ్లు నెరవేర్చే వరకు విధుల్లోకి చేరేందుకు విముఖత..!
Kolkata Doctor Case | వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
Kolkata Doctor Case | వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, డిమాండ్లు నెరవేర్చే వరకు విధుల్లో చేరబోమని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. నేటి సాయంత్రంలోగా విధుల్లో చేరాలని.. ఆ తర్వాత ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోబోమని కోర్టు నిరసన తెలుపుతున్న రెసిడెంట్ వైద్యుల సోమవారం తెలిపింది.
తిరిగి విధుల్లో చేరితే నిరసన తెలిపిన వైద్యులపై ఎలాంటి శిక్షార్షమైన చర్యలు, బదిలీలు చేపట్టబోమని బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. అయితే, డిమాండ్ల నెరవేర్చకపోతే సమ్మె కొనసాగిస్తామని ఆందోళన చేపడుతున్న వైద్యుల్లో ఒకరు తెలిపారు. కోల్‌కతా పోలీస్ కమీషనర్, హెల్త్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను సాయంత్రం 5 గంటల్లోగా తొలగించామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని.. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ రూమ్‌లో మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ మృతదేహం లభ్యమైన కొద్ది గంటలకే జూనియర్ డాక్టర్లు ఆగస్టు 9న తమ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.
మరో వైపు ఆర్థిక అవకతవకల కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సెక్యూరిటీ గార్డు అఫ్సర్ అలీతో పాటు ఇద్దరు సహచరులు, కాంట్రాక్టర్ వెండర్ బిప్లబ్ సిన్హా, సుమన్ హజ్రాలకు కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అవసరమైతే మళ్లీ కస్టడీని కోరుతామని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఆర్జీ కర్ ఎంసీహెచ్‌లో వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా నిరసనల మధ్య ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సందీప్ ఘోష్‌ను సీబీఐ ఈ నెల 2న అరెస్టు చేసింది. 3న కోర్టులో హాజరుపరుచగా ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీకి పంపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

