Kolkata Doctor Case | భద్రత లగ్జరీ కాదు.. మమతా బెనర్జీకి ఐఎంఏ లేఖ
Kolkata Doctor Case | కోల్‌కతాలోని ఆర్జీ ఖర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో మహిళా డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై నేటికీ దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఘటనలో జూనియర్ డాక్టర్‌కు న్యాయం చేయడంతోపాటు పని ప్రదేశంలో భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. డి
Kolkata Doctor Case | కోల్‌కతాలోని ఆర్జీ ఖర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో మహిళా డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై నేటికీ దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఘటనలో జూనియర్ డాక్టర్‌కు న్యాయం చేయడంతోపాటు పని ప్రదేశంలో భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. డిమాండ్ల సాధన కోసం గతవారం రోజులుగా మరోసారి నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) సీఎం మమతా బెనర్జీకి లేఖ రాసింది. జూనియర్ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని కోరింది.
యువ వైద్యులు నిరాహార దీక్షలు చేపట్టిన వారం కావొస్తుందని.. డిమాండ్లపై తక్షణమే దృష్టి సారించాలని ఐఏఎం సూచించింది. న్యాయమైన డిమాండ్లకు తాము మద్దతిస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వానికి అన్ని డిమాండ్లను నెరవేర్చగలిగే సామర్థ్యం ఉందని తెలిపింది. శాంతియుత వాతావరణం, భద్రత విలాసాలు కావని.. ఇది ఒక అవసరమని చెప్పింది. ప్రభుత్వాదినేతగా యువతరం వైద్యుల సమస్యల పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. యావత్ భారతదేశంలోని వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్నాయని.. మీరు (సీఎం) వారి ప్రాణాలను కాపాడగలరని తాము విశ్వసిస్తున్నామన్నారు. ఏదైనా సహాయం చేయగలిగితే సంతోషంగా చేస్తామని ఐఎంఏ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

