CM Ashok Gehlot: ఆ కిల్లర్స్‌కు బీజేపీతో లింకుంది: రాజస్థాన్ సీఎం
CM Ashok Gehlot: ఉదయ్‌పూర్‌లో హత్యకు గురైన టేలర్ కన్హయ్య లాల్‌ను చంపిన వారికి బీజేపీతో సంబంధాలు ఉన్నట్లు సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. నవంబర్ 25వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మతకలహాలను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కన్హయ్య హత్య కేసులో ఎన్ఐఏ ఎటువంటి చర్యలు తీసుకున్నదో తెలియదని, కానీ ఒకవేళ ఎస్‌వోజీ ఆ కేసును దర్యాప్తు చేస్తే, ఇప్పటికే నిందితులకు శిక్ష పడేదని సీఎం గెహ్లాట్ పేర్కొన్నారు.
జోద్పూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(CM Ashok Gehlot) కీలక ఆరోపణలు చేశారు. ఉదయ్‌పూర్‌లో హత్యకు గురైన టేలర్ కన్హయ్య లాల్‌ను చంపిన వారికి బీజేపీతో సంబంధాలు ఉన్నట్లు ఆయన ఆరోపించారు. నవంబర్ 25వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మతకలహాలను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జోద్‌పూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ఐఏ బదులుగా రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఆ కేసును దర్యాప్తు చేపడితే, ఎప్పుడో ఆ కేసు పరిష్కారం అయ్యేదని గెహ్లాట్ పేర్కొన్నారు.
సస్పెన్షన్‌కు గురైన బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్ధించిన టేలర్ కన్హయ్యను ఇద్దరు వ్యక్తులు గత ఏడాది జూన్ 28వ తేదీన తలనరికేసి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. తొలుత ఆ కేసును ధన్మండి పోలీసు స్టేషన్లో నమోదు చేశారు. ఆ తర్వాత ఎన్ఐఏకు బదిలీ చేశారు. కన్హయ్య హత్య కేసులో ఎన్ఐఏ ఎటువంటి చర్యలు తీసుకున్నదో తెలియదని, కానీ ఒకవేళ ఎస్‌వోజీ ఆ కేసును దర్యాప్తు చేస్తే, ఇప్పటికే నిందితులకు శిక్ష పడేదని సీఎం గెహ్లాట్ పేర్కొన్నారు.
కేసుతో సంబంధం ఉన్న రియాజ్ అక్తరి, గౌస్ మహమ్మద్‌లను అరెస్టు చేశామని, ఆ నిందితులకు బీజేపీతో లింకులు ఉన్నాయని, హత్యా ఘటనకు కొన్ని రోజుల ముందు ఆ ఇద్దరూ మరో కేసులో అరెస్టు అయ్యారని, అయితే ఆ ఇద్దర్నీ బీజేపీ నేతలే వచ్చిన పోలీసు స్టేషన్ నుంచి విడిపించినట్లు సీఎం గెహ్లాట్ తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ జిమ్మిక్కులు చేస్తోందని సీఎం గెహ్లాట్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

