సైబర్ మోసాలకు ‘కిల్ స్విచ్’తో చెక్!
దేశంలో నానాటికీ సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం వాటికి చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కేంద్ర హోం శాఖకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు అత్యంత వేగంగా, భీతికొల్పే విధంగా జరుగుతున్నాయి. మోసగాళ్లు బ్యాంకు ఖాతాల నుంచి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు.
- బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లలో ఎమర్జెన్సీ బటన్
- బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసే వ్యవస్థ..కేంద్రం యోచన
న్యూఢిల్లీ, జనవరి 22: దేశంలో నానాటికీ సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం వాటికి చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కేంద్ర హోం శాఖకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు అత్యంత వేగంగా, భీతికొల్పే విధంగా జరుగుతున్నాయి. మోసగాళ్లు బ్యాంకు ఖాతాల నుంచి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోం శాఖ ‘కిల్ స్విచ్’ గురించి చర్చిస్తున్నట్టు ఆ అధికారి తెలిపారు. బాధితులకు ఇలాంటి మోసం ఏదో జరుగుతున్నదని అనిపించగానే వెంటనే తమ ఫోన్లోనే ‘కిల్ స్విచ్’ను ఉపయోగించి మొత్తం లావాదేవీలను నిలిపివేసేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఏమిటీ కిల్‌స్విచ్?
ఇది మన ఫోన్లోని బ్యాంకింగ్ లేదా యూపీఐ యాప్‌లలో ఎమర్జెన్సీ బటన్లాగా పనిచేస్తుంది. సైబర్ మోసగాళ్లు తమను లక్ష్యంగా చేసుకున్నారు లేదా తమ ఖాతాల నుంచి తమకు తెలియకుండానే నగదు వెళ్లిపోతున్నట్టు అనిపించగానే బాధితులు వెంటనే ‘కిల్ స్విచ్’ బటన్‌ను ఉపయోగించవచ్చు. దీంతో తమ ఖాతా నుంచి జరిగే అన్ని లావాదేవీలు తక్షణం నిలిచిపోతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

