Khan Coaching Centre: బీహార్‌లో ఖాన్ సార్ కోచింగ్ సెంటర్‌పై అటాక్
Khan Coaching Centre: ఖాన్ సార్ కోచింగ్ సెంటర్‌పై అటాక్ జరిగింది. ఫైసల్ ఖాన్ కోచింగ్ సెంటర్ బీహార్‌లో చాలా ఫేమస్. సుమారు 20 మంది కోచింగ్ ఇన్స్టిట్యూట్ వద్దకు చేరుకుని హంగామా చేశారు. రెండు కోచింగ్ సెంటర్ల మధ్య వివాదం ఈ దాడికి దారితీసినట్లు తెలుస్తోంది.
పాట్నా: బీహార్‌లో ఓ కోచింగ్ సెంటర్(Khan Coaching Centre)పై అటాక్ జరిగింది. ఎడ్యుకేటర్ ఫైసల్ ఖాన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్పై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి దాడి చేశారు. ఖాన్ సార్ కోచింగ్ సెంటర్‌గా ఆ ఇన్స్టిట్యూట్కు పేరున్నది. ఆ సెంటర్‌పై దుండగులు రాళ్లు రువ్వారు. ఫైరింగ్ కూడా జరిగినట్లు రూమర్స్ వస్తున్నాయి, కానీ పోలీసులు మాత్రం దీన్ని దృవీకరించలేదు. కదంకౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఖాన్ గ్లోబల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఖాన్ గ్లోబల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్పై జరిగిన అటాక్‌కు సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు. సుమారు 20 మంది కోచింగ్ ఇన్స్టిట్యూట్ వద్దకు చేరుకుని హంగామా చేసినట్లు తెలుస్తోంది. రాళ్లు రువ్వి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత ఖాన్ సార్ మీడియాతో మాట్లాడారు. మరో కోచింగ్ సెంటర్‌కు చెందిన సంఘవిద్రోహ శక్తులు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు ఖాన్ ఆరోపించారు. అల్లరిమూకలు తుపాకీ పేల్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. తక్కువ ఫీజుకే విద్యార్థులకు ఎలా బోధిస్తున్నారని, ఆ స్టూడెంట్స్ ఎలా ఫలితాలు సాధిస్తున్నారన్న అనుమానాలు కోచింగ్ సెంటర్లకు ఉన్నట్లు ఖాన్ ఆరోపించారు. ఇటీవల రిలీజైన బీహార్ పోలీసు రిక్రూట్మెంట్ పరీక్షల్లో ఖాన్ కోచింగ్ సెంటర్‌కు చెందిన అనేక మంది ఎంపికైనట్లు తెలుస్తోంది.
Patna: CCTV footage of attack on Khan Sir’s coaching center emerges, causing a stir pic.twitter.com/Uo7i1qEA31
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 3, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

