లగ్జరీ కార్లలో ‘రోల్స్ రాయిస్’ ప్రత్యేకత వేరు. కేరళకు చెందిన యువకుడు హదీఫ్ కేవలం రూ.45 వేలతో రోల్స్ రాయిస్ తరహా కారును తయారుచేశాడు. న్యూబాడీ కిట్‌ను ఉపయోగించి మారుతి 800 కారును రోల్స్ రాయిస్‌గా తీర్చిదిద్దాడు. యూజ్డ్ కార్లలోని మెటల్ షీట్లను, ఇతర పరికరాల్ని వాడినట్టు హదీఫ్ తెలిపాడు.
కొత్తగా ఆవిష్కరించిన కారుపై అద్దాలు, చక్రాలు, హెడ్‌లైట్స్ వివిధ భాగాలను లగ్జరీ కారును తలపించేలా ఆవిష్కరించాడు. హదీఫ్ గతంలో మోటార్ సైకిల్ ఇంజిన్‌ను ఉపయోగించి జీప్‌ను తయారుచేశాడు.
– తిరువనంతపురం