Body Exhumed: కేరళలో పూజారి సజీవ సమాధి.. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు
Body Exhumed: కేరళలో ఓ పూజారి సజీవ సమాధి అయ్యారు. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం .. ఆ పూజారి మృతదేహాన్ని వెలికితీశారు.
తిరువనంతపురం: కేరళలోని ఆలయ పూజారి గోపన్ స్వామి.. ఇటీవల సజీవ సమాధి అయ్యారు. అయితే ఆ పూజారి మృతదేహాన్ని ఇవాళ సమాధి నుంచి పోలీసులు వెలికితీశారు. తిరువనంతపురం జిల్లాలోని నెయ్యటింకర గ్రామంలో ఆ పూజారి సమాధి అయినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. పూజారి సజీవ సమాధి అయినట్లు జనవరి 10వ తేదీన పోస్టర్లు వెలిశాయి. దీంతో గ్రామస్థులు ఆ సమాధిపై అనుమానాలు వ్యక్తం చేశారు. గోపన్ స్వామి కోరిక మేరకు సమాధి కట్టినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కానీ గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసును పోలీసులు నమోదు చేశారు.
ఇవాళ భారీ సంఖ్యలో పోలీసులు ఆ సమాధి వద్దకు వచ్చి .. దాంట్లో నుంచి శవాన్ని బయటకు తీశారు. కూర్చుని ఉన్న పూజారి దేహాన్ని.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని వెలికి తీయరాదు అని కుటుంబం వేడుకున్నా.. కేరళ హైకోర్టు ఆదేశాల ప్రకారం సమాధి నుంచి పూజారి శవాన్ని బయటకు తీశారు. ఫోరెన్సిక్, వేలిముద్ర నిపుణులు సమాధి సైట్ వద్దకు చేరుకున్నారు. అనుమానిత మృతి, వ్యక్తుల అదృశ్యం అఆంటి కేసుల్లో దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టవచ్చు అని జస్టిస్ సీఎస్ డయాస్ తెలిపారు. జనవరి 9వ తేదీన రాత్రి తన తండ్రి సజీవ సమాధి అయినట్లు రాజసేనన్ తెలిపారు. ప్రైవేటుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని, పబ్లిక్‌గా చేయవద్దు అని ఆదేశించినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nominated Posts | కోటరీకే నామినేటెడ్ కిరీటం.. 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్, మహేశ్‌గౌడ్ కసరత్తు
Farmers | 20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. అయినా రైతుకు పలకరింపేది?
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

