Kerala Nurses: 1400 మంది మలయాళీలు.. 700 కోట్లు కాజేశారు.. కేరళ నర్సులపై కేసు
Kerala Nurses: కేరళ నర్సులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కువైట్‌కు చెందిన బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టారు. సుమారు 1400 మలయాళీలు.. దాదాపు 700 కోట్ల రుణం తీసుకుని ఉడాయించినట్లు .. కేరళలో ఫిర్యాదు నమోదు అయ్యింది.
కొచ్చి: కేరళ నర్సుల(Kerala Nurses)పై భారీ కేసులు నమోదు అయ్యాయి. కువైట్‌కు చెందిన గల్ప్ బ్యాంక్ నుంచి కోట్ల రుణం తీసుకుని ఉడాయించారు. సుమారు 1400 మంది మలయాళీలు.. దాదాపు 700 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. సాలరీ సర్టిఫికేట్లను గ్యారెంటీగా పెట్టి .. గల్ప్ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేరళలో దర్యాప్తు మొదలైంది.
ఈ నేపథ్యంలో గల్ప్ బ్యాంక్‌కు చెందిన డిప్యూటీ జనరల్ మేనేజర్ కేరళను విజిట్ చేశారు. లా అండ్ ఆర్డర్ ఏడీజీపీకి ఆయన ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే 10 కేసులు నమోదు చేశారు. ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాల్లో ఆ కేసులు నమోదు అయ్యాయి. ఒక్కొక్క నర్సు సుమారు 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గల్ఫ్ బ్యాంక్ కువైట్ షేర్‌హోల్డింగ్ కంపెనీ లో మోసం జరిగినట్లు గుర్తించారు. నిందితుల్లో ఎక్కువ శాతం మంది నర్సులే ఉన్నట్లు తేలింది. డిఫాల్టర్ల వివరాలను పోలీసులకు బ్యాంకు వెల్లడించింది. ఆ వివరాల ఆధారంగా కేసులను రిజిస్టర్ చేస్తున్నారు. మూడు నెలల క్రితం బ్యాంకులో ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించారు. తొలుత చిన్న రుణాలను తీసుకుని.. వాటిని సకాలంలో చెల్లించేవారు. దీంతో బ్యాంకు నమ్మకాన్ని గెలుచుకునేవారు. 2020 నుంచి 2022 మధ్య కాలంలో ఈ ఫ్రాడ్ జరిగింది.
ఆ తర్వాత భారీ మొత్తంలో లోన్ తీసుకుని .. విదేశాలకు లేదా స్వంత దేశాలకు వెళ్లిపోతున్నట్లు బ్యాంక్ ఆరోపించింది. రుణం తీసుకున్న వారి లోకల్ అడ్రెస్సులు బ్యాంక్ వద్ద ఉన్నాయి. ఆ వివరాలను పోలీసులకు అందజేశారు. చాలా ప్లాన్ ప్రకారం ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించిన బ్యాంకు అధికారులు.. ఈ కేసులో దర్యాప్తు కోసం కేరళ పోలీసుల్ని ఆశ్రయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

