Narayanan Nair | ‘వయస్సు కేవలం సంఖ్య మాత్రమే’.. ఎన్నికల్లో పోటీచేస్తున్న 90 ఏళ్ల వృద్ధుడి వ్యాఖ్య
Narayanan Nair | కేరళ (Kerala) స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) లో 90 ఏళ్ల వృద్ధుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నాడు. ఈ వయస్సులో అతడు వార్డు సభ్యుడిగా పోటీచేయడం చర్చనీయాంశమైంది.
Narayanan Nair : కేరళ (Kerala) స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) లో 90 ఏళ్ల వృద్ధుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నాడు. ఈ వయస్సులో అతడు వార్డు సభ్యుడిగా పోటీచేయడం చర్చనీయాంశమైంది. ఈ వయస్సులో పోటీ ఎందుకు అని ప్రశ్నిస్తే.. వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని, వయస్సు దేనికీ అడ్డంకి కాదని వ్యాఖ్యానించారు.
వివరాల్లోకి వెళ్తే.. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన నారాయణన్ నాయర్ వయస్సు 90 ఏళ్లు. ఆయన అశమన్నూర్ పంచాయతీలో రెండో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. తెల్ల చొక్కా, ధోతీ ధరించిన నారాయణన్ నాయర్ వణుకుతున్న స్వరంతోనే ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు కార్యకర్తలు, మద్దతుదారులతో ఆర్భాటంగా ప్రచారాలు నిర్వహిస్తుండగా.. నారాయణన్ నాయర్ మాత్రం ఒంటరిగా జనం దగ్గరకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ఈ వయసులో ఎన్నికల్లో పోటీకి దిగడంపై ప్రశ్నించగా.. వయసు దేనికీ అడ్డుకాదన్నారు. అది కేవలం సంఖ్య మాత్రమే అని చెప్పారు. తాను తన వార్డు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని, అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తాననే నమ్మకం తనకు ఉందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కాగా, కేరళలో రెండు దశల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 9, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 13న ఫలితాలు వెలువడనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాగల రెండు రోజులు వర్ష సూచన
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

