కరోనా వార్డులో పెండ్లి చేసుకున్న కేరళ జంట

తిరువనంతపురం: ఒక జంట కరోనా వార్డులో పెండ్లి చేసుకున్నది. కేరళలోని అలప్పుజ వైద్య కళాశాలలో ఆదివారం ఈ ఘటన జరిగింది. కైనకారి ప్రాంతానికి చెందిన శరత్ మోన్, అభిరామికి ఇటీవల పెండ్లి నిశ్చయమైంది. విదేశాల్లో ఉద్యోగం చేసే శరత్ కేరళకు వచ్చి పెండ్లి పనుల్లో ఉండగా కరోనా సోకింది. ఆయన తల్లి కూడా కరోనా బారిన పడటంతో వారిద్దరు అలప్పుజ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని కరోనా వార్డులో ఉన్నారు.
మరోవైపు ముందుగా నిర్ణయించిన ఈ నెల 25న శరత్, అభిరామికి పెండ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో కరోనా వార్డులో పెండ్లి కోసం జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందారు. దీంతో ఆదివారం వధువు అభిరామి, మరో బంధువు పీపీఈ కిట్ ధరించి కరోనా వార్డులోకి ప్రవేశించారు. వరుడు శరత్ తల్లి దండలు అందించగా వారిద్దరు మార్చుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bride
- Covid Ward
- Kerala
- Marriage
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

