కేరళ గవర్నర్‌ను వర్సిటీ ఛాన్సలర్‌గా తొలగించేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్
గవర్నర్ స్థానంలో నిపుణులైన విద్యావేత్తను రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు తెలిపారు.
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో ఆయనను యూనివర్సిటీ ఛాన్సలర్ పదవి నుంచి తొలగించాలని వామపక్ష ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేరళ మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. గవర్నర్ స్థానంలో నిపుణులైన విద్యావేత్తను రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం చేస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, కేరళలోని తొమ్మిది యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయాలని ఆదేశించారు. దీంతో తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ ఆదేశాన్ని సవాల్ చేశారు.
మరోవైపు ప్రభుత్వంతో సంబంధం లేకుండా గవర్నర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై సీఎం విజయన్ ప్రభుత్వం మండిపడుతోంది. ఈ నేపథ్యంలో వర్సిటీ ఛాన్సలర్ పదవి నుంచి ఆయనను తప్పించేందుకు ఒక ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేరళ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ దీనిపై సంతకం చేస్తేనే అది అమలులోకి వస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

