తన మార్నింగ్ వాక్ కోసం రోడ్డు బ్లాక్… ట్రాఫిక్ పోలీస్ అధికారికి నోటీసులు
తిరువనంతపురం: తన మార్నింగ్ వాక్ కోసం రోడ్డును బ్లాక్ చేసిన ట్రాఫిక్ పోలీస్ అధికారికి ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు. కేరళలోని కొచ్చిలో ఈ సంఘటన జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ట్రాఫిక్ వెస్ట్, వినోద్ పిళ్లై కొచ్చిలోని క్వీన్స్ వాక్ వేలో ఇటీవల ఉదయం వేళ వాక్ చేస్తున్నారు. దీని కోసం ట్రాఫిక్ సిబ్బంది ఆ రోడ్డును బ్లాక్ చేస్తున్నారు. కాగా, క్వీన్స్ వాక్ వేలో పిల్లల సైక్లింగ్, స్కేటింగ్ కోసం కేవలం ఆదివారం మాత్రమే ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఒక భాగం రోడ్డును మూసివేస్తారు.
అయితే ట్రాఫిక్ పోలీస్ అధికారి వినోద్ పిళ్లై మార్నింగ్ వాక్ కోసం ఇటీవల ప్రతి రోజూ దీనిని బ్లాక్ చేస్తున్నారు. అంతేగాక ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం స్కూళ్లకు వెళ్లే పిల్లలు, వారిని బస్సుల్లో ఎక్కించే తల్లిదండ్రులతోపాటు ఉద్యోగాలకు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. ఇది సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారికి దీనిపై నోటీసులు జారీ చేశారు.
కాగా, గత నెలలో ఢిల్లీలో ఒక ఐఏఎస్ అధికారి తన భార్య, పెంపుడు కుక్కతో ఈవినింగ్ వాక్ కోసం త్యాగరాజ్ స్టేడియంలోని క్రీడాకారులు, శిక్షకులను ముందుగానే బయటకు పంపివేస్తున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) సంజీవ్ ఖిర్వార్ను లడఖ్‌కు ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి రింకు దుగ్గాను అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

