కేరళ చర్చిలో కరోనా కలకలం.. ఇద్దరు ఫాదర్లు మృతి

తిరువనంతపురం: కేరళలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ)కి చెందిన ఇద్దరు ఫాదర్లు కరోనాతో బుధవారం చనిపోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటం కలకలం రేపుతున్నది. ఇడుక్కి జిల్లాలోని మున్నార్ హిల్ స్టేషన్లో ఏప్రిల్ 13 నుంచి 17 వరకు సీఎస్ఐ ఆధ్వర్యంలో వార్షిక తిరోగమన కార్యక్రమం జరిగింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అయితే ఇందులో పాల్గొన్న పలువురు కరోనా బారినపడ్డారు. కరాకోణంలోని సిఎస్ఐ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫాదర్ సి బినోకుమార్ (39), ఫాదర్ వై దేవప్రసాద్ (59) బుధవారం మరణించారు. వారి సహచరులు ఐదుగురు ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు చర్చి వర్గాలు వెల్లడించాయి. మే తొలి వారంలో ఇద్దరు చర్చి ఫాదర్లు చనిపోగా, చాలా మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మరింత మందికి కరోనా సోకి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

