Sabarimala Master Plan | రూ.1,033 కోట్లతో శబరిమల అభివృద్ధి.. మాస్టర్ ప్లాన్‌కు కేరళ మంత్రివర్గం ఆమోదం
Sabarimala Master Plan | కేరళలోని ప్రసిద్ధ శబరిమలను రూ.1,033.62 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సన్నిధానం, పంపా, ట్రక్ రూట్ వంటి కీలక ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి బ్లూప్రింట్ రూపొందించారు.
తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ శబరిమలను రూ.1,033.62 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. (Sabarimala Master Plan) సన్నిధానం, పంపా, ట్రక్ రూట్ వంటి కీలక ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి బ్లూప్రింట్ రూపొందించారు. మొత్తం రూ.778.17 కోట్ల వ్యయంతో సన్నిధానం ప్రాంతాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశ పనులకు రూ. 600.47 కోట్లు, 2028-2033 మధ్య చేపట్టనున్న రెండో దశ పనులకు రూ. 100.02 కోట్లు, 2034-39 మధ్య చేపట్టనున్న మూడో దశ పనులకు రూ.77.68 కోట్లు కేటాయించనున్నారు.
కాగా, అయ్యప్ప స్వామి సన్నిధానం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతకు భంగం కలుగకుండా లేఅవుట్ ప్లాన్ రూపొందించినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాంతాన్ని ఎనిమిది జోన్లుగా విభజించినట్లు పేర్కొంది. మకరవిళక్కు (మరక జ్యోతి) దృశ్యాలు కనిపించేలా, భక్తుల రద్దీని నియంత్రించేలా రెండు ఓపెన్ ప్లాజాలు నిర్మించనున్నట్లు వెల్లడించింది.
మరోవైపు అటవీ మార్గంలో ప్రయాణించే యాత్రికుల సురక్షితం, సౌకర్యం కోసం వాహన రూట్ లేఅవుట్ ప్లాన్‌ను రూపొందించారు. ఈ మార్గంలో షెల్టర్లు, విశ్రాంతి భవనాలు నిర్మిస్తారు. రోడ్డుకు రెండు వైపులా అత్యవసర వాహన లేన్, పర్యావరణ పునరుద్ధరణ కోసం బఫర్ జోన్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ. 47.97 కోట్ల వ్యయంతో ట్రక్ రూట్ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. తొలి దశ పనులకు రూ.32.88 కోట్లు, రెండో దశ పనులకు రూ.15.50 కోట్లు కేటాయించనున్నారు.
కాగా, పంపా అభివృద్ధికి రూ.207.48 కోట్లు ఖర్చువుతుందని అంచనా వేశారు. మొదటి దశకు రూ. 184.75 కోట్లు, 2028-33 మధ్య రెండో దశ పనులకు రూ.22.73 కోట్లు కేటాయిస్తారు. శబరిమల మాస్టార్ ప్లాన్ ప్రకారం పంపా, ట్రక్ రూట్ అభివృద్ధికి కలిపి మొత్తం రూ. 255.45 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

