RCP Singh on Nitish | ఏడు జన్మలెత్తినా నితీశ్ ప్రధాని కాలేరు.. జేడీయూ మాజీ నేత ఆర్సీపీ సింగ్ సెటైర్
RCP Singh on Nitish | బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ఏడు జన్మలెత్తినా ప్రధాని కాలేరని జేడీయూ మాజీ నేత ఆర్సీపీ సింగ్ ఎద్దేవా చేశారు.
RCP Singh on Nitish | బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఏడు జన్మలెత్తినా ప్రధానమంత్రి కాలేరని జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ ఎద్దేవా చేశారు. గత నెలలో జేడీయూ నుంచి వైదొలిగిన ఆర్సీపీ సింగ్.. తనపై కొందరు ఆగంతక కార్యకర్తలు చేసిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నితీశ్ సారధ్యంలోని జేడీయూను డిమాండ్ చేశారు. బీజేపీలో చేరడంతోపాటు అన్ని ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు గురువారం మీడియాతో చెప్పారు.
మరో దఫా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంతో కేంద్ర మంత్రిగా ఆర్సీపీ సింగ్ రాజీనామా చేశారు. బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలతో కూడిన మహాఘట్బంధన్ కూటమితో కలిసి నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల మండిపడ్డారు. `నితీశ్‌కుమార్ ఎన్నిసార్లు కూటములు మారుస్తారు. ఇప్పటివరకు నాలుగు సార్లు – 1994, 2013, 2017, 2022ల్లో కూటములు మార్చేశారు` అని గుర్తు చేశారు.
ఆర్జేడీలో విలీనం చేయడం మినహా జేడీయూకు మరో ఆప్షన్ లేదని ఆర్సీపీ సింగ్ ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కుమార్ సారధ్యంలోని జేడీయూకు వ్యతిరేకంగా, బీజేపీ తరఫున పని చేశానని తనపై వచ్చిన ఆరోపణలను కొట్టి పారేశారు. గతేడాది నితీశ్ కుమార్ ఆమోదం పొందకుండానే ఆర్సీపీ సింగ్ కేంద్ర క్యాబినెట్లో చేరారు. నాటి నుంచి నితీశ్‌కు, ఆర్సీపీ సింగ్‌కు మధ్య దూరం పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

