అంచెలంచెలుగా ఎదిగారు.. అజిత్ పవార్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. రైతు ఉద్యమ నేతగా అజిత్ పవార్ తన ప్రజా జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. రైతు ఉద్యమ నేతగా అజిత్ పవార్ తన ప్రజా జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా అంచెలంచెలుగా ఎదిగి, పలు హోదాల్లో పని చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రాజకీయాలకు తీరని లోటు: కేటీఆర్
అజిత్ పవార్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అజిత్ పవార్ మృతి మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజలకు దశాబ్దాలుగా సేవ చేయడంలో అజిత్ పవార్ అంకితమయ్యారని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలతో క్షేత్ర స్థాయిలో విస్తృత సంబంధాలు కొనసాగించారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అత్యంత విచారకరం: హరీశ్ రావు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం అత్యంత విచారకమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అజిత్ పవార్ కుటుంబసభ్యులు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అజిత్ పవార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
Microsoft: మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. 5 గంటలు స్తంభించిన వివిధ అప్లికేషన్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

