ఉగ్రవాదుల కాల్పుల్లో కశ్మీరి టీవీ నటి మృతి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవల పలువురిపై కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు తాజాగా బుద్గామ్‌లోని చదూరా ప్రాంతంలో కశ్మీరి టీవీ నటి అమ్రీన్ భట్‌ను కాల్చి చంపారు. ఇదే ఘటనలో ఆమె మేనల్లుడు ఫర్హాన్ జుబైర్ గాయపడ్డాడు. పదేళ్ల బాలుడి చేతికి బుల్లెట్ గాయమైందని కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. అమ్రీన్ భట్ తల్లిదండ్రులు, బంధువులు విచారం వ్యక్తం చేశారు. టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ బంధువు జుబైర్ అహ్మద్ మాట్లాడుతూ ‘నిన్న రాత్రి ఇద్దరు వ్యక్తులు షూటింగ్ ఉందంటూ పిలిచేందుకు ఇంటికి వచ్చారు.
అమ్రీన్ బయటకు షూటింగ్‌కు రానని చెప్పడంతో కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఏం తప్పు చేసిందని కాల్పులు జరిపారని ప్రశ్నించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు తెగబడిందని లష్కరే ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అమ్రీన్‌కు టిక్‌టాక్, యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె వీడియోలకు పెద్ద ఎత్తున వ్యూస్ వస్తుంటాయి. ఇదిలా ఉండగా.. కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ఇవాళ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. జుమాగండ్ గ్రామంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
Delimitation | మోదీ సర్కార్‌లో కొత్త ఆశలు.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) మద్దతు!
Nizamia Tibbi | శతాబ్దాల ఘనత ఢిల్లీకి వినపడలే.. అత్యంత పురాతన మెడికల్ కాలేజీ హైదరాబాద్‌లో.. అయినా గుర్తింపునకు నోచుకోలే!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

